LYRIC

Pallavi:

Bratukamtaa baadagaa..kalaloni gaadhagaa..
Kanniti dhaaragaa..karigipoye
talacedi jaragadu…jarigedi teliyadu..
Bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa
bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa
gaaradi chesi gumdenu kosi navvevu i vimta caalikaa
bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa

charanam:1

Andaalu srushtimcinaavu dayato nivu
maralaa ni cetito nive tudicevule
dipaalu nive veligimcinaave gaadaamdhakaaraana vidicevule
kondamta aasha adi aasha chesi
kondamta aasha adi aasha chesi paataala lokaana tocevule
bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa

charanam:2

Okanaati udhyaanavanamu nedu kanamu
adiye marabhumigaa nivu maarcevule
okanaati udhyaanavanamu nedu kanamu
adiye marabhumigaa nivu maarcevule
anuraaga madhuvu amdimci nivu aaraadhana jwaala cesevule
aanamdamamta payanimcu velaa
aanamdamamta payanimcu velaa shokaala samdraana mumcevule
bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa
gaaradi chesi gumdenu kosi navvevu i vimta caalikaa
bommanu chesi praanamu posi aadevu nikidi vedukaa

Telugu Transliteration

పల్లవి:

బ్రతుకంతా బాదగా..కలలోని గాధగా..
కన్నీటి ధారగా..కరిగిపోయే
తలచేది జరగదూ...జరిగేది తెలియదు..
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం:1

అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడి ఆశ చేసీ
కొండంత ఆశ అడి ఆశ చేసీ పాతాళ లోకాన తోచేవులే
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం:2

ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు ఆరాధన జ్వాల చేసేవులే
ఆనందమంత పయనించు వేళా
ఆనందమంత పయనించు వేళా శోకాల సంద్రాన ముంచేవులే
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

Added by

Latha Velpula

SHARE

Comments are off this post