LYRIC

Pallavi:

Chettulekkagalavaa o narahari

Puttalekkagalavaa

Chettulekki a chitaarukommala

Chiguru koyagalavaa

O narahari chiguru koyagalavaa

Chettulekkagalane o chenchita puttalekkagalane

Chettulekki a chitaaru kommala

Chiguru koyagalane o chenchita

Chiguru koyagalane

 

Charanam:1

Urakaleyagalavaa o narahari

Parugulettagalavaa //uraka//

Uda pattukuni jaarudu bamdaku

Ugi cheragalavaa

Urakaleyagalane o chenchita

Parugulettagalane

Udapattukuni jaarudu bamdaku

Ugi cheragalane o chemchita

Ugi cheragalane

 

Charanam:2

Gurini choosukoni kanulu moosukuni

Baanameyagalane o chenchita

Baanameyagalane

O chenchita ninnu mimchagalane //chettu//

 

Charanam:3

Taguvulela egataalikattaneevaa o chenchita

Taali kattaneevaa

Manasu telusukuni marulu choopite

Manuvunaadanistaa o narahari

Manuvunaadanistaa o narahari

 

Telugu Transliteration


పల్లవి:

చెట్టులెక్కగలవా ఓ నరహరి
పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల
చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల
చిగురు కోయగలనే ఓ చెంచిత
చిగురు కోయగలనే


చరణం:1

ఉరకలేయగలవా ఓ నరహరి
పరుగులెత్తగలవా "ఉరక"
ఊడ పట్టుకుని జారుడు బండకు
ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఓ చెంచిత
పరుగులెత్తగలనే
ఊడపట్టుకుని జారుడు బండకు
ఊగి చేరగలనే ఓ చెంచిత
ఊగి చేరగలనే


చరణం:2

గురిని చూసుకొని కనులు మూసుకుని
బాణమేయగలనే ఓ చెంచిత
బాణమేయగలనే
ఓ చెంచిత నిన్ను మించగలనే "చెట్టు"


చరణం:3

తగువులేల ఎగతాళికట్టనీవా ఓ చెంచిత
తాళి కట్టనీవా
మనసు తెలుసుకుని మరులు చూపితే
మనువునాడనిస్తా ఓ నరహరి
మనువునాడనిస్తా ఓ నరహరి

Added by

Latha Velpula

SHARE

Comments are off this post