LYRIC

Pallavi:

Dayaceyandi Dayaceyandi
tamamta Varikaleramdi! Tamamta Varika Leramdi!
ati Dharmatmulu Ati Punyatmulu Ati Dhimamtulu Miramdi
tagu Kaivaram Tagu Satkaram
tagu Matramga Gaikomdi
tamamta Varika Tamaramdi – Tatamgamamta Tamakamdi
hai Hai Vaivai Kaikai Gaigai Jiyya…

 


charanam:1

pendli Kumara, Ravayya, Ma Bagyam Koddi Dorikavayya//2//
mullokalanu Vetiki Teccina Alludavamte Ni Vayya
mullokalanu Galimci Teccina Lludavamte Nivayya

Kiritalu Kiritalu Vajralu Kiritalu Dhaga Dhaga Kiritalu
dharimcinamtane Talalo Merayunu
bale Yocanalu Brahmamdamuga
sirastranamulu Sirodharyamulu Siroja Rakshalu Kiritalive
amdukomdayya Doralu Mumduku Ramdayya
amdukomdayya Doralu Mumduku Ramdayya

 

Charanam:2

rakshalu Rakshalu Padarakshalu – Natya Sikshanalo Balasikshalu
todigana Todane – Todhimi Todhimi
adugu Veyagane – Taitakkataitakka
todigana Todane – Todhami Todhami
aduguveyagane – Taitakka Taitakka
nelamidanika Niluvaniyaka Kulasaga Mimu Natimpajese “rakshalu”

Okate Ma Vayasu O Raja Okate Ma Sogasu
okate Ma Vayasu O Raja Okate Ma Sogasu
nayagaramu Na Kalara Vayyaramu Na Valara
nayagaramu Na Kalara Vayyaramu Na Valara Oy
nene Ni Jodura Nene Ni Idura Vanne Cinne Lennara “o Raja”
vanne Cinne Lennara O Raja “okate”
sarasatalo Idi Janara Rasikatalo Idi Ranira,
sarasatalo Idi Janara Rasikatalo Idi Ranira, Oy
ninne Koritira Ninne Ceritira Vanne Cinnelennara O Raja
vanne Cinnelennara O Raja “okate”

Telugu Transliteration

పల్లవి:

దయచేయండీ దయచేయండీ
తమంత వారికలేరండీ! తమంత వారిక లేరండీ!
అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు అతి ధీమంతులు మీరండీ
తగు కైవారం తగు సత్కారం
తగు మాత్రంగా గైకొండి
తమంత వారిక తమరండీ - తతంగమంతా తమకండి
హై హై వైవై కైకై గైగై జియ్యా...


చరణం:1

పెండ్లి కుమారా, రావయ్యా, మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
ముల్లోకాలను వెతికి తెచ్చిన అల్లుడవంటే నీ వయ్యా
ముల్లోకాలను గాలించి తెచ్చిన ల్లుడవంటే నీవయ్యా

కిరీటాలు! కిరీటాలు! వజ్రాలు కిరీటాలు! ధగ ధగ కిరీటాలు!
ధరించినంతనె తలలో మెరయును
బలె యోచనలు బ్రహ్మాండముగా
శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివె
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా


చరణం:2

రక్షలు రక్షలు పాదరక్షలు - నాట్య శిక్షణలో బాలశిక్షలు
తొడిగన తోడనె - తోధిమి తోధిమి
అడుగు వేయగనే - తైతక్కతైతక్క
తొడిగన తోడనె - తోధమి తోధమి
అడుగువేయగనే - తైతక్క తైతక్క
నేలమీదనిక నిలువనీయక కులాసగ మిము నటింపజేసే "రక్షలు"

ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ
ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ
నయగారము నా కళరా వయ్యారము నా వలరా
నయగారము నా కళరా వయ్యారము నా వలరా ఒయ్
నేనే నీ జోడురా నేనే నీ ఈడురా వన్నె చిన్నె లెన్నరా "ఓ రాజా"
వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా "ఒకటే"
సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా,
సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా, ఒయ్
నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా
వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా "ఒకటే"

Added by

Latha Velpula

SHARE