LYRIC

Pallavi:

Tandanaane..taanaane..aanandame..//4//
Pachani chilukalu todunte
paade kooyila ventunte
bhuulokame aanandaaniki illoyi..
lokamlo kannerinka chellu//2//
chinna chinna guutilone swargamundi le
arey chinni chinni gundellona prema inkipodu le
seetakoka chilukaku cheeralenduku
arey prema unte chaalunanta dabbu gibbu endukanta//pachani//

 

Charanam:1

Andani minne aanandam..ande manne aanandam
arey bhuumini cheelchuku putte
pachani pasirika aanandam..
manchuki yende aanandam..vaaguki vaane aanandam..
arey yendaki vaanaki rangulu
maare prakruti aanandam..
bratuke nuurellandam..bratuke brahmaanandam..
cheliya..vayasudige..swagatamlo..
anubandham..aanandamaanandam..//pachani//

 

Charanam:2

Ne swaasanu nenaite..na vayase aanandam..
maru janmaku nanne kannavante inkaa aanandam..
chali guppe maasam lo..cheli volle aanandam..
na chevulanu muustuu duppati kappe
karune aanandam..
andam o aanandam..bandham paramaanandam..
cheliya..itarulakai..kanujaare..
kannere aanandamaanandam..//pachani//

Telugu Transliteration

పల్లవి:

తందానానే..తానానే..ఆనందమే..//4//
పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లోయి..
లోకంలో కన్నీరింక చెల్లు(2)
చిన్న చిన్న గూటిలోనే స్వర్గముంది లే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదు లే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట//పచ్చని//


చరణం: 1

అందని మిన్నే ఆనందం..అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే
పచ్చని పసిరిక ఆనందం..
మంచుకి ఎండే ఆనందం..వాగుకి వానే ఆనందం..
అరె ఎండకి వానకి రంగులు
మారే ప్రకృతి ఆనందం..
బ్రతుకే నూరేళ్ళందం..బ్రతుకే బ్రహ్మానందం..
చెలియా..వయసుడిగే..స్వగతంలో..
అనుబంధం..ఆనందమానందం..//పచ్చని//


చరణం: 2

నీ శ్వాసను నేనైతే..నా వయసే ఆనందం..
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం..
చలి గుప్పే మాసం లో..చెలి ఒళ్ళే ఆనందం..
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే
కరుణే ఆనందం..
అందం ఓ ఆనందం..బంధం పరమానందం..
చెలియా..ఇతరులకై..కనుజారే..
కన్నీరే ఆనందమానందం..//పచ్చని//

Added by

Latha Velpula

SHARE

  1. prasadbabu

    January 31, 2018 at 1:17 pm

    superb song I Love this song Atleast once a weak i listen this song before sleeping such a good and lovely words….thanks to A.R.Rehaman sir…..

Leave a Reply