LYRIC


Pallavi:

Sarikotta cheera uhinchinanu
saradaala sariganchu teeyinchinanu
manasu mamata badugu peda
cheeralo chitrinchinanu
idi enno kalala kala neta
na vannela raasiki siri jota//2//

 

Charanam:1

Muchata golipe mogali podduku
mullu vasana oka andam
abhimanam gala aadapillaku
alaka kuluku oka andam
ee andaalannee kalabosaa
ne konguku chenguna mudi vesta//2//

 

Charanam:2

Chura chura chupulu oka maaru
ne chiru chiru navvulu oka maaru
muti virupulu oka maaru
nuvvu mudduku siddam oka maaru
nuvvu ye kalanunnaa maa baage
ee chira visesham allaage//2//

Telugu Transliteration

పల్లవి:

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు తీయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత(2)


చరణం:1

ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు
ముళ్ళు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు
అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోసా
నే కొంగుకు చెంగున ముడి వేసా (2)


చరణం:2

చుర చుర చూపులు ఒక మారు
నే చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు
నువ్వు ముద్దుకు సిద్దం ఒక మారు
నువ్వు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే(2)

Added by

Latha Velpula

SHARE