LYRIC


Pallavi:

Sitaalu nuvvu leka nenu lene
unnaave uupiralle gundelone
vellipote cherukuntaa mattilone
aa kaburu chere logaa cheru nanne
sitaalu nuvvu leka nenu lene

 

Charanam:1

Sandepoddu muddaraalu jaajipoolu koyu vela
poolu koyalenidi manase kosenanta
pelli chiraa pasupu nitta pindaareyu vela
manasu padina vaadi manase pindenantaa
gaddi chatu vamulona baasa chesi koodaa
poyavu poyavu le prema teesi gattu netti
ni chira chengu lone kannillu moota gatti
poyavu poyavu le korukunna todu vidi
ichchina mallelanni natteta visiresi
nannu kanneeti vaagulona ala chesi
aadi tapputaaru aadavallu annamaata
maatalu kaavavi niti paina raatalanta
aadi tapputaaru aadavallu annamaata
maatalu kaavavi niti paina raatalanta
o o sitaalu nuvvu leka nenu lene
unnaave uupiralle gundelone
vellipote cherukuntaa mattilone
aa kaburu chere logaa cheru nanne
sitaalu nuvvu leka nenu lene
o o o o

 

Charanam:2

Bottuniku pettina veli rangu aaralede
poosukunna chandanala vasaninkaa taggalede
gaajuvakalona konna gaajulinka veyyalede
pelli panche kattukunna pasupu vanne maayalede
kalyana bugga chukkaa kallara chusedi eppudammaa
mallela pakkamida bantulaata eppudammaa
ni kanti konasupu kosari ruvvedi eppudamma
sikati elugulona sindulata eppudamma
ellamavi totaalonaa ekaaki goruvankaa
sruti maari kusenamma jatakosam vechenamma
aadi tapputaaru aadavallu annamaata
maatalu kaavavi niti paina raatalanta
aadi tapputaaru aadavallu annamaata
maatalu kaavavi niti paina raatalanta
sitaalu nuvvu leka nenu lene
unnaave uupiralle gundelone
vellipote cherukuntaa mattilone
aa kaburu chere logaa cheru nanne
sitaalu nuvvu leka nenu lene
o o o o unnaave uupiralle gundelone

 

 

 

Telugu Transliteration

పల్లవి:

సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే


చరణం:1

సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా
పూలు కొయలేనిది మనసే కొసేనంటా
పెళ్ళి చీరా పసుపు నిత్త పిండారెయు వేళ
మనసు పడిన వాడి మనసే పిండెనంటా
గడ్డి చటు వాములోన బాస చేసి కూడా
పొయావు పొయావు లే ప్రేమ తీసి గట్టు నెట్టి
నీ చీర చెంగు లోనె కన్నిళ్ళు మూట గట్టి
పొయావు పొయావు లే కోరుకున్న తోడు వీడీ
ఇచ్చిన మల్లెలన్ని నట్టేట విసిరేసి
నన్ను కన్నీటి వాగులొన అల చేసి
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఓ ఓ సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ


చరణం:2

బొట్టునీకు పెట్టిన వేలి రంగు ఆరలేదే
పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే
గాజువాకలోన కొన్న గాజులింక వేయ్యలేదే
పెళ్ళి పంచె కట్టుకున్న పసుపు వన్నె మాయలేదే
కళ్యాణ బుగ్గ చుక్కా కళ్ళారా చూసేది ఎప్పుడమ్మా
మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మా
నీ కంటి కొనసూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మ
సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ
ఏల్లమావి తోటాలోనా ఏకాకి గొరువంకా
శృతి మారి కుసేనమ్మ జతకొసం వేచేనమ్మ
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట
మాటలు కావవి నీటి పైన రాతలంట
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే


Added by

Latha Velpula

SHARE