LYRIC

Pallavi:

Totaloki rakura  tumtari tummeda, gadasari tummeda
mamalli manasemto tellanidi adi//2//
e vannelecinneleruganidi

 
Charanam:1

Kannusaiga ceyakura
kamini cora gopikajara
ma radha anuragam maranidi   adi
e   rasakelilona ceranidi     //tota//

 
Charanam:2

Jilugupaita lagakura
tolakari  tummeda,cilipi tummeda
kannesiggu melimusugu vidanidi-adi
innallu emdakanneruganidi  //tota//

 
Charanam:3

Roju  dati pogane
jajulu vadunura-
mojulu vidunura
kannevalapu sannajaji vadanidi  adi
ennijanmalaina vasivadanidi    //tota//

Telugu Transliteration

పల్లవి:

తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా
మామల్లి మనసెంతో తెల్లనిది -అది
ఏ వన్నెలేచిన్నెలెరుగనిది-


చరణం:1

కన్నుసైగ చేయకురా
కామినీ చోరా గోపికాజారా
మా రాధ అనురాగం మారనిది అది
ఏ రాసకేళిలోన చేరనిది ||తోట||


చరణం:2

జిలుగుపైట లాగకురా
తొలకరి తుమ్మెదా,చిలిపి తుమ్మెదా
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది-అది
ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది- ||తోట||


చరణం:3

రోజు దాటి పోగానే
జాజులు వాడునురా-
మోజులు వీడునురా
కన్నెవలపు సన్నజాజి వాడనిది - అది
ఎన్నిజన్మలైనా వసివాడనిది ||తోట||



Added by

Latha Velpula

SHARE

Comments are off this post