LYRIC

Pallavi:

Unte yee voollo vumdu

Potae mee daesam poraa

Chuttupakkala vunnaavamtae

Choodakumdaa praanam vumdaduraa…    //unte//

 

Charanam:1

Koolikeltae naakae raaraa chaenu vunnaadi

Koodu timtae naato tinaraa todu vumtaadee

Imkaedakainaa ellaavamtae

Naadi chuppanaati manasu adi neeku telusu

Oppi voorukonamtadi… //unte//

 

Charanam:2

Oori nimdaa vayasu pillalu _ omtigunnaaru

Vaatamaina vaanni choostae _ vadalanamtaaru

Nee chapalabuddi soopaavamtae

Manishi naaku dakka vimka mamchidaanni kaanu aanaka… //unte//

 

Charanam:3

Pagati poota panilo paditae _ palakanamtaavu

Raatiraela ragassemga raanu jadisaevu

Nae tellavaarlu maelukumtae…

Errabadda kalluchoosi

Aemaemo anukuni eedi kullukumtadi… //unte//

Telugu Transliteration

పల్లవి:

ఉంటే యీ వూళ్ళో వుండు
పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే
చూడకుండా ప్రాణం వుండదురా... //ఉంటే//


చరణం:1

కూలికెళ్తే నాకే రారా చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా తోడు వుంటాదీ
ఇంకేడకైనా ఎల్లావంటే
నాది చుప్పనాతి మనసు అది నీకు తెలుసు
ఒప్పి వూరుకోనంటది... //ఉంటే//


చరణం:2

ఊరి నిండా వయసు పిల్లలు _ ఒంటిగున్నారు
వాటమైన వాణ్ణి చూస్తే _ వదలనంటారు
నీ చపలబుద్ది సూపావంటే
మనిషి నాకు దక్క వింక మంచిదాన్ని కాను ఆనక... //ఉంటే//


చరణం:3

పగటి పూట పనిలో పడితే _ పలకనంటావు
రాతిరేళ రగస్సెంగ రాను జడిసేవు
నే తెల్లవార్లు మేలుకుంటే...
ఎర్రబడ్డ కళ్ళుచూసి
ఏమేమొ అనుకుని ఈది కుళ్ళుకుంటది... //ఉంటే//

Added by

Latha Velpula

SHARE