LYRIC

Eru Senaga Kosam Mattini Tavvite
Ekanga Tagilina Lanke Bindelaaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Sinta Chettu Ekki Chiguru Koyyabote
Chetiki Andina Chandamaama Laaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Malle Poola Madya Mudda Bantilaaga
Enta Sakkagunnave
Mutyaduva Mellona Pasupu Kommulaaga Enta Sakkagunnave
Sukkala Cheera Kattukunna Vennelalaaga Enta Sakkagunnave

Eru Senaga Kosam Mattini Tavvite
Ekanga Tagilina Lanke Bindelaaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Sinta Chettu Ekki Chiguru Koyyabote
Chetiki Andina Chandamaama Laaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave

O Rendu Kaalla Sinukuvi Nuvvu
Gunde Serlo Dookesinaavu
Alala Moota Vippesinaavu Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Mabbuleni Merupuvi Nuvvu
Nela Meeda Nadichesinaavu
Nannu Ningi Cbesesinaavu Enta Sakkagunnave
Cheruku Mukka Nuvvu Koriki Tinta Unte Enta Sakkagunnave
Cheruku Gedake Teepi Rusi Telipinaave Enta Sakkagunnave
Tiranaallo Tappi Edche Biddaku Edurocchinaa Talli Laaga
Enta Sakkagunnave Lacchimi Enta Sakkagunnave
Gaali Pallakeelo Enki Paatalaaga
Enki Paatalona Telugu Maatalaaga
Enta Sakkagunnave Lacchimi Enta Sakkagunnave

Kadava Nuvvu Nadumuna Betti
Katta Meeda Nadichostu Unte
Sandram Nee Sankekkinattu Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Kattela Mopu Talakettukonee
Adugulona Adugestaa Unte
Adavi Neeku Godugettinattu Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Burada Chelo Vari Naatu Ettaa Unte Enta Sakkagunnave
Boomi Bommaku Nuvvu Praanam Postunnattu Enta Sakkagunnave

Eru Senaga Kosam Mattini Tavvite
Ekanga Tagilina Lanke Bindelaaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnave
Sinta Chettu Ekki Chiguru Koyyabote
Chetiki Andina Chandamaama Laaga Enta Sakkagunnave
Lacchimi Enta Sakkagunnaveok

Comments

comments

Lyrics in Telugu

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ
ఎంత సక్కగున్నవే
ముత్యదువ మెల్లోన పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవే
సుక్కల చీర కట్టుకున్న వెన్నెలలాగ ఎంత సక్కగున్నవే

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే

ఓ రెండు కాల్ల సినుకువి నువ్వు
గుండె సెర్లొ దూకేసినావు
అలల మూట విప్పేసినావు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
మబ్బులేని మెరుపువి నువ్వు
నేల మీద నడిచేసినావు
నన్ను నింగి చ్బేసేసినావు ఎంత సక్కగున్నవే
చెరుకు ముక్క నువ్వు కొరికి తింట ఉంటె ఎంత సక్కగున్నవే
చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే
తిరనాల్లొ తప్పి ఏడ్చె బిడ్డకు ఎదురొచ్చినా తల్లి లాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
గాలి పల్లకీలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

కడవ నువ్వు నడుమున బెట్టి
కట్ట మీద నడిచొస్తు ఉంటే
సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
కట్టెల మోపు తలకెత్తుకోనీ
అడుగులోన అడుగేస్తా ఉంటే
అదవి నీకు గొడుగెట్టినట్టు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
బురద చేలో వరి నాటు ఎత్తా ఉంటె ఎంత సక్కగున్నవే
బూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే

Added by

Kranthi Rekha

SHARE

Comments are off this post

    ADVERTISEMENT