మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ట్రేలర్ విడుదల జరుపుకున్న “కాదంబరి-ఇంటి నెంబర్ 150” పాటలను మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న డా.దాసరి ఆవిష్కరించారు.

దాసరి స్వగృహంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర దర్శకురాలు మరియు కథానాయకి హాసికదత్, తోటకూర రామకృష్ణారావు, రాము, షేక్ అల్లా బకష్,  ధీరజ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
బీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న “కాదంబరి-ఇంటి నెంబర్ 150” చిత్రానికి హాసికాదత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది కూడా ఆమే కావడం విశేషం.
ఇప్పుడిప్పుడే హీరోయిన్ ఎదుగుతున్న ఓ అమ్మాయి హీరోయిన్ గా నటిస్తూనే, దర్శకత్వం వహించడం ఎంతయినా అభినందనీయమని డా.దాసరి అన్నారు. తనకెంతో ప్రీతిపాత్రుడైన రామసత్యనారాయణ తాజాగా నిర్మిస్తున్న “కాదంబరి-ఇంటి నంబర్ 150” మంచి విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు.
దాసరిగారి చేతుల మీదుగా తమ చిత్రం ఆడియో విడుదల కావడం, ఆయన ఆశీస్సులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని రామ సత్యనారాయణ, హాసికాదత్ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కాదంబరి” చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చెందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
మధుమిత, రాజీవ్, వినయ్, శ్రీమాన్, సండ్రాయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సెల్వం, పాటలు: పోతుల రవికిరణ్, ఛాయాగ్రహణం: కార్తీక్ నల్లముత్తు, సంగీతం: ఉమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హాసికాదత్ !!

 

SHARE