LYRIC

pallavi:

Em sandeham ledu
Aa andaala navve ee sandallu thecchindi
Em sandeham ledu
Aa kandeti sigge ee thondarlu icchindi
Em sandeham ledu
Aa gandhaala gonthe aanandaalu penchindi

Nimishamu nela meeda nilavani kaalilaaga
Madi ninu cheruthonde chilakaa
Thanakoka thodu laaga venakane saaguthondi
Hrudayamu raasukunna lekhaa..

 

Em sandeham ledu
Aa andaala navve ee sandallu thecchindi
Em sandeham ledu
Aa kandeti sigge ee thondarlu icchindi

 

charanam:1

Vennello unnaa
Vecchangaa undi ninne oohisthunte
Endarilo unnaa
Edolaa undi nuvve gurthosthunte
Naa kallallokocchi
Nee kallaapi challi o muggesi vellaave

Nidurika raadu anna nijamunu mosukuntu
Madi ninu cheruthunde chilakaa
Thanakoka thodu laaga venakane saaguthundi
Hrudayamu raasukunna lekhaa..

Vennello unnaa
Vecchangaa undi ninne oohisthunte
Endarilo unnaa
Edolaa undi nuvve gurthosthunte

 

charanam:2

Nee kommallo guvva
Aa gummamlokelli koo antundi vinnaavaa
Nee mabbullo jallu
Aa mungitlo poolu pooyisthe chaalannaavaa
Emauthunnaa gaani emainaa aiponii
Em parvaaledannaavaa

Adugulu veyyaleka atu itu thelchukoka
Sathamathamaina gunde ganukaa
Adigina daanikinka badulika pamputhundi
Padamulu leni mouna lekhaa..
Hmm.. Hmm. Hmm.. Hmm..
Hmm.. Hmm. Hmm.. Hmm..

 

Telugu Transliteration

ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు
ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద నిలవని కాలిలాగ
మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖా..

ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే

నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా..

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వ
ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు
ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గాని
ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా..
హ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్..
హ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్..




Added by

Latha Velpula

SHARE

  1. Tejesh

    March 18, 2018 at 7:51 pm

    Nice song
    Super lyrics
    Fantastic voice of Singers

Leave a Reply